TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ ఆహ్వానం.. దాడి అభిప్రాయం

Published on: Wed Jul 4, 2018 10:26AM

ఎన్నికలు దగ్గరికొస్తున్న కొద్దీ పవన్ దూకుడు పెంచుతున్నారు.. ఓ వైపు పర్యటనలు మరోవైపు భేటీలతో బిజీ బిజీగా ఉంటున్నారు.. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌, మాజీ మంత్రి దాడి వీరభద్రరావును కలిసి ఆయనకు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలిపారు.. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య రాజకీయ పరిస్థితుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తుంది.. మంచి వ్యక్తి, అనుభవశీలి అయిన దాడి జనసేనలో చేరాలని పవన్ ఆహ్వానించగా.. దాడి మాట్లాడుతూ 'పవన్‌ కుటుంబంతో మూడు దశాబ్దాలుగా అనుబంధం ఉంది.. పవన్ గొప్ప నటుడు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చారు' అన్నారు.. అదే విధంగా తన అనుచరుల అభిప్రాయం తీసుకొని జనసేనలో చేరిక పట్ల తన నిర్ణయాన్ని చెబుతానన్నారు.