పవన్ పాలిట్రిక్స్
Published on: Thu Oct 24, 2013 2:04PM

మెగా బ్రదర్స్ పవన్కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పుకార్లు రావడం...వీటిపై నాగబాబు లేఖ రాయడంతో ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ పుకార్లను ఎవరూ సృష్టించారన్న దానిపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓ ఆసక్తి చర్చ నడుస్తోంది.
‘అత్తారింటికి దారేది’ సినిమాకి మైలేజ్ పెంచుకోవడానికే పవన్కళ్యాణ్ వర్గీయులే ఈ పుకార్లని షికార్లు చేయించారనేది వారి వాదన. సినిమాకి మళ్లీ రిపీటెడ్ ఆడియన్స్కి థియేటర్ కి రప్పించడానికి ఈ ట్రిక్కు కనిపెట్టారట. దీనితో ఈ సినిమాకి ఇంకాస్త మైలేజీ వచ్చిందని అనుకుంటున్నారు. మరి వంద కోట్ల వైపుగా అత్తారింటిని లాగాలంటే... ఇలాంటి ట్రిక్కులు తప్పవు.


