పవన్ భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు..!!

 

'ఇంట గెలిచి రచ్చ గెలవాలి' అంటారు.. అలానే రాజకీయాల్లో 'ఇంట్లో వారి నమ్మకం గెలిచి, ప్రజల నమ్మకం గెలవాలి' అంటారు.. పవన్ ప్రజల నమ్మకం ఏ మాత్రం గెలిచారో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది.. ప్రస్తుతానికి అయితే ఇంట్లో వారి నమ్మకం మాత్రం గెలిచారు.. దానికి ఉదాహరణే తాజాగా పవన్ సోదరుడు నాగబాబు, పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో పవన్ భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని నాగబాబు బల్లగుద్ది మరి చెప్తున్నారు.. 'ప్రజల్లో మార్పు వచ్చింది.. డబ్బులు తీసుకొని ఓట్లు వేసే రోజులు పోయాయి.. మంచి పాలన అందించేవాళ్ళకి ఓటు వేయాలని అనుకుంటున్నారు.. నాకు తెలిసి భారీ మెజారిటీతో కళ్యాణ్ బాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు' అని నాగబాబు అన్నారు.. అంతేకాదు ఢిల్లీలో కేజ్రీవాల్ ఎలాగో ఏపీలో కళ్యాణ్ బాబు అలా అవుతారని అన్నారు.. చూద్దాం మరి నాగబాబు నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో.