కాంగ్రెస్ తరుపున చిరంజీవి ప్రచారం.!!
Published on: Mon Jul 30, 2018 11:39AM
సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ పార్టీ ఆశించిన విజయం సాధించకపోవడంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు.. కేంద్రమంత్రిగా కూడా పనిచేసారు.. అయితే విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. చిరంజీవి కూడా కాంగ్రెస్ కి, రాజకీయాలకి దూరంగా ఉంటూ.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.. ఇక చిరంజీవి రాజకీయాలకి దూరమనే భావన అందరిలో వ్యక్తమైంది.. అయితే ఇప్పుడు చిరంజీవి రాజకీయాల గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
.jpg)
వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున చిరంజీవి ప్రచారం చేస్తారని, పవన్ కు అండగా చిరు ఉంటారని ఇలా రకరకాలుగా వార్తలొచ్చాయి.. దానికి తగ్గట్టే చిరంజీవి ఫ్యాన్స్ కూడా జనసేనలో చేరి పవన్ కి అండగా ఉంటున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంగ్రెస్ వాదనే వేరేలా ఉంది.. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.. తాజాగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'రాహుల్ గాంధీతో, నాతో కూడా మాట్లాడారు.. ఎన్నికలకు రెండు నెలల ముందు కాంగ్రెస్ తరపున వచ్చి ప్రచారం చేస్తానని చెప్పారు.. నెల క్రితం కూడా ఇదే విషయం చెప్పారు' అని అన్నారు.. మరి చిరంజీవి నిజంగా కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తారో లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.


