3న తిరుమలలో పవన్ ‘వారాహి సభ’!
Published on: Tue Sep 24, 2024 11:05AM

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం విదితమే. స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఆయన తన దీక్షను తిరుమలలో విరమించనున్నారు. అందు కోసం అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమల చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం దీక్షను విరమిస్తారు. 3న తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.


