వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్.. జనసేనాని సొల్యూషన్..
Published on: Fri Oct 29, 2021 3:53PM
గంజాయి సాగు కొందరికీ ఉపాధి. గంజాయి దందా మరికొందరికి వ్యాపారం. గంజాయి స్మగ్లింగ్‌పై ఉదాసీనత చాలామంది పెద్దలకు కనకవర్షం. ఇలా విశాఖ మన్యంలో గంజాయి.. అంశాన్ని అనేక కోణాల్లో చూడాల్సి ఉంటుంది. తాజాగా, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఆయన గంజాయి అంశంపై వరుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మరోసారి ట్విటర్‌లో వైసీపీ తీరును ఏకిపారేశారు.
ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ‘గంజాయి స్మగ్లింగ్’ అంశాన్ని సామాజిక-ఆర్థిక సమస్యగా చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ట్విటర్ వేదికగా గంజాయి అంశంపై స్పందించారు. ‘‘ఈ సమస్య అకస్మాత్తుగా తలెత్తలేదు, ఇది 15-20 ఏళ్లుగా ఉంది. నేను 2018 నుండి ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నాను. ప్రస్తుత వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింత ఎక్కువైంది. YCP ప్రభుత్వం ఈ ముప్పును అరికట్టాలి. ఈ వేల కోట్ల విలువైన గంజాయి వ్యాపారాన్ని అంతం చేయడానికి పటిష్టమైన చట్టాన్ని అమలు చేయాలి. సమాన ఉపాధి అవకాశాలను సమాంతరంగా సృష్టించాలి’’ అంటూ 2018లో గంజాయి గురించి తాను మాట్లాడిన వీడియోను పవన్ పోస్ట్ చేశారు.



