ఎంపీలు అసెంబ్లీలో ఉంటారా పవన్.!!
Published on: Tue Jul 24, 2018 1:26PM
రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి.. ఏ మాత్రం నోరుజారినా ఆ మాటలు హాస్యానికి దారి తీస్తాయి.. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఏపీలో చాలా జరిగాయి.. జలీల్ ఖాన్ బికామ్ లో ఫిజిక్స్ అన్నారు.. మురళి మోహన్ వెంకన్న చౌదరి అని నోరు జారారు.. వీటి మీద సోషల్ మీడియాలో ఇప్పటికీ ఛలోక్తులు వస్తూనే ఉన్నాయి.. ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కూడా చేరారు.
.jpg)
ఇప్పటికే ఒకసారి పవన్ 'బల్బ్ ని కనిపెట్టింది ఐన్ స్టీన్' అని టంగ్ స్లిప్ అయిన సంగతి తెలిసిందే.. అప్పట్లో దీని మీద బాగానే జోకులొచ్చాయి.. తాజాగా పవన్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.. తనకు పది మంది ఎంపీలుంటే, జగన్మోహన్ రెడ్డిలా పారిపోకుండా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేవాడిని అని పవన్ అన్నారు.. పవన్ మాట్లాడుతున్నారన్న ఉత్సాహంలో అక్కడున్న వారు చప్పట్లు కొట్టారు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఛలోక్తులు వినిపిస్తున్నాయి.. 'పవన్ ఎంపీలు అసెంబ్లీలో కాదు పార్లమెంట్ లో ఉంటారు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి.


