అధికారిక ప్రకటన.. పవన్ పోటీచేసే స్థానాలివే

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేసే స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక స్థానాల నుంచి పవన్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. భీమవరం పేరు మాత్రం అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు.