ఉన్న ఒక్క ఎమ్మెల్యేను లాక్కొంటే.. ఎంతకైనా తెగిస్తా.. జగన్ పై పవన్ ఫైర్

 

 

జనసేన అధినేత పవన్ ఏలూరు లోక్ సభ స్థానం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి గురించి స్థానిక నాయకుల నుండి ఆరా తీసారు. ఈ స్దనిర్బంగా అనేక మంది పార్టీ నేతలు వైసీపీ పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసిందని పవన్ కు వివరించారు. ఈ సమీక్ష లో భాగంగా ఆయన సీఎం జగన్ పైన సంచలన కామెంట్స్ చేసారు. గత ఎన్నికల సమయంలో డబ్బులు పంచటం వైసీపీకే సాధ్యపడిందని.. అందుకే వారు అధికారంలోకి వచ్చారని జనసేన అధినేత పవన్ అన్నారు. అసలు వైసీపీ అధినేత జగన్ కు జనసేన పార్టీ అంటే ఎందుకు అంట కక్ష అని అయన ప్రశ్నించారు. తమ పార్టీ తరుఫున గెలిచినా ఒకే ఒక్క ఎమ్మెల్యేను తమ వైపు లాక్కొనేందుకు జగన్కు ట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మీద అనేక కేసులు నమోదు చేసారని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే సమయంలో జర్నలిస్ట్ పై దాడి చేసి హత్య చంపేస్తానని బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదని పవన్ ప్రశ్నించారు. అదే సమయంలో వైయస్ వివేకా హత్య గురించి అయన ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో ఎందుకు అడుగు ముందుకు పడటం  లేదంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏపీలో మొట్ట మొదటి సారిగా అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పై 75 రోజులలోనే ఈ స్థాయిలో పవన్ సీరియస్ కామెంట్స్ చేయడం పై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కర చర్చ జరుగుతోంది.