ఇంద్రకీలాద్రిపై కుమార్తె తో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
Published on: Wed Oct 9, 2024 12:27PM
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు పాల్గొనడం మామూలే. అయితే జనసేన అధినేత, ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ మాత్రం కుటుంబ సభ్యులతో పాల్గొనడం విశేషమనే చెప్పాలి. బుధవారం ఇంద్రకీలాద్రిపై ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని దుర్గాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. . ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఏడోరోజు దుర్గాదేవి శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. దీనికితోడు ఇవాళ మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న దర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
ఉదయం క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్ ఆలయం వద్దకు చేరుకున్నారు. పవన్ కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వెంట కూతురు కూడా ఉన్నారు.


