జగన్ కామెంట్స్.. ఫ్యాన్స్ కి పవన్ వార్నింగ్..!!

జగన్, పవన్ ఒకరిమీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.. పవన్ కార్లను మార్చినట్టు పెళ్లాలను మారుస్తున్నాడని జగన్ అంటే.. 'శుక్రవారం ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి?' అంటూ జగన్ ని ఉద్దేశించి పవన్ అన్నారు.. ఇలా ఇద్దరి మధ్య విమర్శలు కాస్తా ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధంగా మారింది.. జగన్ ఫ్యాన్స్ పవన్ గురించి, పవన్ ఫ్యాన్స్ జగన్ గురించి వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తున్నారు.. కుటుంబ సభ్యుల గురించి కూడా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

 

 

ఈ కామెంట్స్ పవన్ వరకు చేరాయి.. అందుకే పవన్ ఇలాంటి కామెంట్స్ చేయవద్దని ఫ్యాన్స్ కి విన్నపం లాంటి వార్నింగ్ ఇచ్చారు.. 'ఈ మధ్య జగన్‌ మోహన్‌రెడ్డి గారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలామందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది.. నేను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకీ వెళ్లను.. అది రాజకీయ లబ్ది కోసం వాడను.. ప్రజలకు సంబంధించిన పబ్లిక్ పాలసీల మీదే మిగతా పార్టీలతో విభేదిస్తాను కానీ, నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు.. ఈ తరుణంలో ఎవరైనా జగన్ మోహన్‌రెడ్డిగారిని కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ, వారి ఇంటి ఆడపడుచులను కానీ ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను.. ఈ వివాదాన్ని దయచేసి అందరూ ఇక్కడితో ఆపివేయాల్సిందిగా నా ప్రార్థన' అని పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.