జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌‌

 

జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌‌ను భీమవరంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ విడుదల చేశారు.. విజన్‌ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలు.. రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో నెలకు రూ. 2500 నుంచి 3500 వరకు జమ,మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు మరో ఐదు శాతం పెంచే ఆలోచన, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్‌ కింద రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేయడం, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, ముస్లింల అభివృద్ధికి సచార్‌ విధానం అమలు, మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు, అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు వసతి గృహాలు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు, వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు.. జనసేన అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేపడుతుందని జనసేన పేర్కొంది.