కడప స్టీల్‌ ప్లాంటును అడ్డుకుంది తెలుగుదేశమే

 

కేంద్రం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యపడదని చెప్పడం.. టీడీపీ నేతలు సీఎం రమేష్, బి.టెక్ రవి దీక్ష చేపట్టడం తెలిసిందే.. అయితే అసలు కడప స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందే టీడీపీ వల్ల అంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేసారు.. 'ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలు చేస్తున్న టీడీపీ నేతలే ఒకప్పుడు దాన్ని అడ్డుకున్నారు.. తమకి లబ్ది చేకూరదనే ఉద్దేశంతో అడ్డుకున్న నేతలు, ఇపుడు లబ్ది చేకూరితే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమే అంటున్నారు.. జిందాల్ సంస్థ తాము స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమని నాతో చెప్పింది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు.. పర్సెంటేజీలు ఇస్తేనే పరిశ్రమల ఏర్పాటు జరుగుతుంది.. దీంతో ఆ సంస్థ వెనక్కెళ్లింది.. ఇలానే ఉంటే రాష్ట్రంలో నిరోద్యోగం పెరిగి, యువతలో అశాంతి నెలకుంటుందని' పవన్ అన్నారు.. అలానే ఈ నెల 29న కడప స్టీల్‌ ప్లాంటు కోసం జరిగే రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారు.