ట్విట్టర్ పై జనసేనాని ఫైర్.. కీలక వ్యక్తుల హస్తం?

 

జనసేన పార్టీకి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన పార్టీ మద్దతుదారులకు సంబంధించిన ఖాతాల్ని బ్లాక్ చేసింది. యాక్టివ్‌గా ఉంటూ.. భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ పీఎస్‌పీకే, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ పీఎస్‌పీకే ఫ్యాన్స్ వంటి ఖాతాలను సస్పెండ్ చేయడం చర్చగా మారింది. దాదాపు 400 దాకా జనసేన ట్విట్టర్ ఖాతాలు ఒకేసారి సస్పెండ్ అవ్వడం జనసైనికులని విస్తుపోయేలా చేసింది. 

ఇక ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ట్విట్టర్‌ వేదికగానే ఈ ఘటనపై స్పందించిన జనసేనాని.. జనసేన మద్దతుదారులకు సంబంధించి 400 అకౌంట్లను ట్విట్టర్ ఎందుకు సస్పెండ్ చేసిందో తనకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయులైన ప్రజల తరఫున నిలబడినందుకే ఈ ఖాతాలను సస్పెండ్ చేశారా? అంటూ ట్విట్టర్ నిర్వహకులను ప్రశ్నించారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి..? బ్లాక్ చేసిన తమ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని పవన్ డిమాండ్ చేశారు. మరి, పవన్ డిమాండ్‌పై ట్విట్టర్ ఎలా స్పందిస్తోంది? అనేది ఆసక్తికరంగా మారింది

కాగా, నల్లమల అడవుల్ని కాపాడాలంటూ.. జనసేన అధినేత ఉద్యమం ప్రారంభించారు. జనసేన కార్యకర్తలంతా 'సేవ్ నల్లమల' పేరుతో ప్రచారం ప్రారంభించారు. వీరు చాలా దూకుడుగా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ అయ్యాయి. దీని వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉందని జనసేన అనుమానిస్తోంది. సేవ్ నల్లమల ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయాలన్న ఉద్దేశంతో ట్విట్టర్ పై ఒత్తిడి తెచ్చి నిలిపి వేయించారన్న ప్రచారం జరుగుతోంది.


 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.