సినిమాలపై పవన్ మనసు మార్చుకున్నాడా..?

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నాడా..? అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇంతకీ పవన్ ఏ విషయంలో మనసు మార్చుకున్నాడబ్బా అనుకుంటున్నారా..? అదేంటంటే...ఒకపక్క రాజకీయాలు చూసుకుంటూనే..మరోపక్క సినిమాలు కూడా చేయాలని కూడా ఆలోచనలో పడ్డారని అనుకుంటున్నారు. దీనికి కారణం.. సినిమాలు చేసుకుంటూనే..పార్టీకి మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారట. వివరాల ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు చాలా సార్లు ప్రెస్ మీట్ లో ఇకపై తాను ఎక్కువ రాజకీయాలపైనే దృష్టి పెడతానని.. సినిమాలకు దూరంగా ఉంటానని... అవసరమైతే సినిమాలను కూడా వదిలేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే సినిమాలు వదులుకోవడం కరెక్ట్ కాదని పవన్ కి సన్నిహితులు చెప్పారట. పార్టీ కోసం ఫండ్స్ వసూలు చేసే ఆలోచన లేనప్పుడు .. సినిమాలు చేయకపోతే ఎలా? అనే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించారట. ఇంతటి క్రేజ్ ను తెచ్చిన సినిమాలను చేస్తూ ఉండటమే పార్టీకి మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. దాంతో పవన్ తన మనసు మార్చుకున్నట్టు సమాచారం. ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరోవైపున రాజకీయాలను చక్కబెట్టాలనే ఆలోచనలో పడ్డారట. చూద్దాం ఏం చేస్తారో..