పవన్ నోరు విప్పేది కోట్ల కోసమేనా?
Published on: Tue Jan 19, 2016 9:27AM
.jpg)
పవన్ కల్యాణ్... మూడొచ్చినప్పుడు పూనకం వచ్చినట్టు మాట్లాడేస్తుంటాడు. కానీ.... మిగిలిన సమయంలో మైకు ముందు మహా సిగ్గు. మీడియాతో అస్సలు ఇంట్రాక్ట్ అవ్వడు. ఇంటర్వ్యూలు ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది పవన్ కల్యాణ్ ఓ టీవీ ఛానల్‌లో టాక్ షో నిర్వహించబోతున్నాడన్న టాక్ పవన్ అభిమానుల్ని కూడా విస్మరపరుస్తోంది.
బాలీవుడ్ దిగ్గజం.. అమీర్ ఖాన్ సత్యమేవ జయతే అంటూ.. ఓ టాక్ షో నిర్వహించాడు. సినీ గ్లామర్‌కు దూరంగా ప్రజా సమస్యలపై పోరాటమే అజెండాగా సాగిన కార్యక్రమం ఇది. ఈ షో ద్వారా.. అమీర్... సామాన్యుల అభిమానం కూడా సొంతం చేసుకొన్నాడు. ఇప్పుడు పవన్ నిర్వహించే టాక్ షో ఉద్దేశం కూడా అదేనట.
ఎలాగూ పవన్ పాలిటిక్స్‌తో బిజీ కాబోతున్నాడు. ప్రజల మనసు గెలుచుకోవాలంటే ఓ ఫ్లాట్‌ఫామ్ కావాలి. జన సేన ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టాలన్నా, ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నా.. ఓ వేదిక ఉండాలి. అందుకే.. ఈ టాక్ షో నిర్వహించడానికి ఓకే అనేశాడని తెలుస్తోంది. అంతేకాదండోయ్... వీటన్నింటి వెనుక `కోట్ల` ఆలోచనలూ ఉన్నాయి. ఈ షో ద్వారా... భారీగా ఆదాయాన్ని వెనకేసుకోవాలని చూస్తున్నాడు.
ఈ కార్యక్రమం ద్వారా వచ్చే టోటల్ రెవిన్యూలో సగం.. పవన్ ఖాతాలోకి వెళ్తుందట. పవన్ షో అంటే.. అభిమానులంతా టీవీలకు అతుక్కుకోవడం ఖాయం. టీఆర్‌పీ రేటింగ్స్ పెరుగుతాయి. యాడ్స్ రూపంలో కోట్లలో ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో సగానికిపైగానే పవన్‌కి చేరుతుంది. అటు.. ప్రజల్లో ఉంటూనే కోట్లు సంపాదించొచ్చన్నమాట. పవన్ ప్లాన్ అదిరిపోయింది కదూ.


