అద్దె ఇంట్లోకి దిగిన పవన్

 

సినిమాలను దూరం పెట్టి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్.. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం విజయవాడలో ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారు.. ఆ మధ్య విజయవాడ, గుంటూరు మధ్యలో కాజ గ్రామంలో సొంతిల్లు, పార్టీ ఆఫీస్ కోసం స్థలాన్ని తీసుకొని భూమిపూజ నిర్వహించిన పవన్,నిర్మాణం ఆలస్యం అవుతుండటంతో ప్రస్తుతానికి విజయవాడలోని పడమటలంకలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.. సతీసమేతంగా పవన్ ఈరోజు అద్దె ఇంట్లోకి గృహప్రవేశం చేసారు.. ఇక నుండి పవన్ పార్టీ వ్యవహారాలు ఈ ఇంటినుండే చూస్తారని తెలుస్తుంది.. మొత్తానికి పవన్ హైదరాబాద్ నుండి మకాం మార్చి విజయవాడ కేంద్రంగా రాజకీయాలు చేయబోతున్నారన్నమాట.