TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్... మేకప్.. పేకప్: కవిత

Published on: Wed Sep 24, 2014 4:04PM

 

పవన్ కళ్యాణ్ అంటే టీఆర్ఎస్ నాయకులకు మంట. అందుకే ఆయన మీద వీలైనప్పుడల్లా సెటైర్లు వస్తూ వుంటారు. టీఆర్ఎస్ అధినేత అయితే పవన్ కళ్యాణ్ పేరును కూడా మర్చిపోతూ వుంటారు. ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ మీద కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత వెటకారం కామెంట్లు విసిరారు. పవన్ కళ్యాణ్‌ని ఆమె మేకప్.. పేకప్ తరహా వ్యక్తి అని అన్నారు. ఎన్నికలు వస్తే మేకప్ వేసుకుని బయటకి వచ్చి కాసేపు నటించి వెళ్ళిపోతారని అన్నారు. తాము మాత్రం ఎప్పుడూ ప్రజలతోనే మమేకమై వుంటామని కవిత చెప్పారు. ఒక ఆంగ్లపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఈ కామెంట్లు చేశారు.