పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ ఓటమి

 

పవన్ కళ్యాణ్ ఏపీలో కింగ్ మేకర్ అవుతారు. అదృష్టం కలిసొస్తే కర్ణాటక కుమారస్వామి లాగా సీఎం కూడా అవ్వొచ్చని పలువురు భావించారు. కానీ ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. పవన్ సీఎం అవ్వడం ఏమో కానీ.. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయి కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయారు. ఈ ఫలితాలు జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.