అందుకే లోకేశ్ ను విమర్శించా....

 

ఎవ్వరూ ఉహించని విధంగా గుంటూరు జనసేన ఆవిర్భావ సభలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ టీడీపీ పై విమర్శలు గుప్పించి ఏపీ రాజకీయ పరిణామాలనే మార్చేశారు. అసలు పవన్ కళ్యాణ్ టీడీపీ పై యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి.. ఇన్ని రోజులు టీడీపీని విమర్సించని పవన్ కళ్యాణ్ టీడీపీపై ఈ రేంజ్ లో విమర్శలు గుప్పించడానికి కారణం ఏంటీ అని.. ఆలోచనపడ్డారు. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్ పై అవినీతి ఆరోపణలు గుప్పించారు.. ఇసుక నుంచి  మట్టి వరకు  నేల తల్లిని అమ్ముకుంటున్నారు..  ఇదంతా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నా మీద్రుష్టికి రాలేదా? ఒకవేల వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. లేకపోతే మీకు తెలిసే అన్నీ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అలాగే తమిళనాడుకు చెందిన టీటీడీ మాజీ బోర్డ్ మెంబర్ శేఖర్ రెడ్డికి లోకేష్ కు సబంధాలున్నాయని దీనికి మీరు ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు పవన్.

 

దీంతో అసలు పవన్ స్ట్రాటజీ ఏంటని అనుకుంటున్నారు. ఇక పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎదురుదాడికి దిగింది. పవన్ వెనుక బీజేపీ ఉందని కొంతమంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై తాను అవినీతి ఆరోపణలు చేయడానికి కారణం ఏంటో పవన్ చెప్పాడు. ఓ న్యూస్ ఆఫీస్ కు వెళ్లిన పవన్ ను ఒక ముఖ్యమంత్రి కొడుకుపై మీ లాంటి సెలబ్రిటీ అటువంటి ఆరోపణలు చేశారు.. మీ దగ్గరేమన్నా.. ఆధారాలున్నాయా అని అడుగగా.. దీనికి పవన్ సమాధానం చెప్తూ.. లోకేష్ పై ఉన్న ఆరోపణలు అందరి దృష్టిలో ఉన్నవేనని.. వాటినే నేను మళ్లీ గుర్తు చేశానని అన్నారు. అందరి దృష్టిలో ఉండి నీ దృష్టికి రాలేదా అని అందరూ అడుగుతారనే తాను ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. మరి శేఖర్ రెడ్డితో తనకు పరిచయాలు ఉన్నాయని అంటున్నారు అది ఎంత వరకూ నిజమో చెప్పాలి అని అన్నారు...దానికి లోకేశ్..  శేఖర్ రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కదా అని అడుగగా.. అంటే.. ఇలాంటివి కూడా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అంటూ చెప్పాను అంతే అంటూ చాలా తేలిగ్గా తేల్చారు.