దీక్ష విరమించిన పవన్ కళ్యాణ్.. ఆ మాత్రం ఖర్చు చేయలేరా..?


ఉద్దానం కిడ్నీ బాధితులకు సహాయం చేయాలని డిమాండ్  చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క రోజు నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఐదు గంటలకు దీక్ష ప్రారంభించగా.. ఈరోజు ఐదు గంటలతో దీక్ష ముగిసింది. దీంతో పవన్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు అనుకున్నట్టుగా రాజకీయ గుర్తింపు కోసం ఈ దీక్ష చేయలేదు.. సామాజిక చైతన్య కోసం జనసేన పోరాటం చేస్తుంది.. అన్యాయం పరాకాష్టకు చేరినప్పుడే ఉద్యమాలు పుట్టుకోస్తాయి అని అన్నారు. ఇరవై వేల మంది కిడ్నీ బాధితులను ప్రభుత్వం గుర్తించింది. అందులో ఎంత మందికి ప్రభుత్వం సాయం చేస్తుంది... ఎంత మందికి పెన్షన్ ఇస్తుంది..రూ. 2వేల కోట్లు పుష్కరాలకోసం ఖర్చు చేశారు...ఉద్దానంలో ఆ మాత్రం ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో విదేశాలు వెళ్లడానికి డబ్బులుంటాయి.. పేదల జీవితాలు మారవు.. నేతల జీవితాలు మరింత పైకి వెళ్తుంటాయి.. ఏం చేసినా ప్రజలు పట్టించుకోరని అనుకోవద్దని అన్నారు.