TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలకు నేడు పవన్ కళ్యాణ్!

Published on: Tue Oct 1, 2024 1:13PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరుమల వెళ్లనున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై  ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్  తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. ఇందు కోసం ఆయన తిరుమలకు కాలి నడకన బయలుదేరనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన సాయంత్రం 4 గంటలకు అలిపిరి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి నడకదారిలో రాత్రికి తిరుమబల చేరుకుంటారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.