స్వాతంత్ర్య పోరాటం చేసి జైలుకి వెళ్ళారా విజయసాయిరెడ్డి గారు: పవన్

 

ఆదివారం జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై  విరుచుకపడ్డారు. టీడీపీకి టీం బి..టీడీపీకి దత్తపుత్రుడు..డీఎన్ఏ..అంటూ తన గురుంచి ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేసే హక్కు వైసీపీ నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారన్నారు. ఎందరో మహనీయులు అంబేద్కర్..కాన్షీరాం..లాంటి వారే పరాజయం చెందారని వైసీపీ నేతలకు గుర్తు చేశారు. దెబ్బ తిన్నా మళ్లీ పైకి లేస్తా అన్నారు. 

వ్యక్తిగతంగా తాను అందరికి చాలా గౌరవం ఇస్తానని..2004లోనే నా జోలికి రావొద్దని బొత్సకి కబురు పంపించానని తెలిపారు. విజయసాయిరెడ్డి  స్థిమితం లేనట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారని.. ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని..జీవితంలో చాలాసార్లు దెబ్బలు తిన్నానని పవన్ స్పష్టంగా చేసారు.
ఎన్నికల్లో నిలబడలేకుండా..దేశానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులనే రాజ్యసభకు పంపిస్తారు కానీ..సూట్ కేసుల కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా విమర్శలు చేస్తుంటే..సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

రెండు సంవత్సరాల జైలులో ఉన్న వ్యక్తి విమర్శలు చేస్తారా ? అని ప్రశ్నించారు. తనకు భయం లేదని..ఇంటి ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందన్నారు. అయినా విజయసాయిరెడ్డి ఏదో స్వాతంత్ర్య పోరాటం చేసి జైలుకి వెళ్లినట్లు నీతులు మాట్లాడుతున్నారని పవన్ సెటైర్లు వేశారు.