సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలి
Published on: Sat Jul 7, 2018 12:13PM
.jpg)
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ టీడీపీ మీద విమర్శలు గుప్పించారు.. '2014 ఎన్నికల్లో నేను అభ్యర్థులను నిలబెట్టకపోవడం వల్లనే టీడీపీ గెలిచింది.. అయినా ఆ పార్టీకి విశ్వాసం లేదు.. గంటా శ్రీనివాసరావుకు సపోర్టు చేశాను, కానీ ఆయన తన భూములు, వ్యాపారాలను పెంచుకోవడానికి అధికారాన్ని వాడుకున్నారు.. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కూడా హోదా విషయంలో మాటలు మారుస్తున్నారు’ అని ఆరోపించారు.. 'టీడీపీ గూండాలను అదుపు చేయగలిగితే, తాను ముఖ్యమంత్రిని అవుతానని.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడతానని' అన్నారు.. అలానే 'ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గం రాజీనామా చేసి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ రైల్వేజోన్ సాధన కోసం పోరాటం చేయాలి.. ఆయన రాజీనామా చేస్తే వైసీపీ ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయాలని కోరతాను.. నేను కూడా పోరాటంలో దిగుతాను.. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది' అని పవన్ అన్నారు.


