TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శుక్రవారం ఎన్నికలొస్తే పరిస్థితి ఏంటి జగన్..?

Published on: Wed Jul 25, 2018 2:09PM

వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.. ఇరు నేతలు ఒకవైపు అధికారపక్షం టీడీపీ మీద విమర్శలు,ఆరోపణలు చేస్తూనే, మరోవైపు ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.. ఇప్పటికే జగన్, పవన్ కార్లు మార్చినట్టు పెళ్లాలను మారుస్తున్నాడని విమర్శించిన సంగతి తెలిసిందే.

 

 

జగన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల పవన్ అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. సోషల్ మీడియాలో జగన్ పై పవన్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. తాజాగా పవన్ కూడా ట్విట్టర్ వేదికగా జగన్ ని ఉద్దేశిస్తూ విమర్శలు చేసారు.. 'ఒకవేళ ఎన్నికలు.. శుక్రవారం నాడు వస్తే.. పరిస్థితి ఏమిటి.?' అంటూ పవన్ ట్వీట్ చేసారు.. ఇంకేముంది పవన్ అభిమానులు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.. చూద్దాం పవన్ చేసిన శుక్రవారం కామెంట్స్ కి జగన్ ఎలా స్పందిస్తారో.