లోకేష్‌కు పవన్ సవాల్

 

పవన్ కళ్యాణ్ అధికార పార్టీ టీడీపీ మీద విమర్శలే కాదు, ఆ పార్టీ నేతలకి సవాళ్లు కూడా విసురుతున్నారు.. తాజాగా పవన్, మంత్రి నారా లోకేష్ కు సవాల్ విసిరారు.. లోకేష్ ని దొడ్డి దారిన మంత్రి చేసారు, సీఎం ని కూడా చేస్తానంటే చూస్తూ ఊరుకోము అన్న పవన్.. దమ్ముంటే లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు.. అదే పని లోకేశ్ చేస్తే, తమ పార్టీ తరఫున ఒక కార్యకర్తను పోటీకి దింపుతామని.. ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్ సవాల్ విసిరారు.. అదే విధంగా ఏ సమస్య పైనైనా సరే.. చర్చించేందుకు తాను సిద్ధమని, తనతో లోకేష్ బహిరంగ చర్చకు సిద్దమా? అని పవన్ ప్రశ్నించారు.