పిల్లల కోసమే వచ్చాను: పవన్
Published on: Thu Nov 21, 2013 9:44AM

గత వారం రోజులుగా హైదరాబాద్ లో జరిగిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... మూడు రోజుల క్రితం ఎఫ్డీసి చైర్మన్ దానకిషోర్ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పిల్లల కోసమే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. పిల్లల మీద ఉన్న ప్రేమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అందరికి ఆనందాన్నిచ్చిన ఈ కార్యక్రమంలో నేను కూడా ఓ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలదర్శకులు, లైవ్ యాక్షన్ విభాగాల విజేతలకు గవర్నర్ నరసింహన్ జ్ఞాపికల్ని, ధ్రువపత్రాలను అందజేశారు. లఘు చిత్రాల విజేతలకు మంత్రి డి.కె.అరుణ జ్ఞాపికల్ని అందజేసారు. యానిమేషన్ విభాగ విజేతలకు పవన్ జ్ఞాపికల్ని అందజేశారు.


