TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాధాకృష్ణ వార్నింగ్... లైట్ తీసుకుంటాడా..!

Published on: Wed Apr 25, 2018 4:25PM

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై పెద్ద యుద్దమే చేస్తున్నారు. తన తల్లిని దూషించినందుకుగాను... ఆ విషయాన్ని మీడియాలో పదే పదే డిబెట్లు బెట్టి చర్చించినందుకు గాను.. పవన్ మీడియాపై వార్ ప్రకటించారు. ఇప్పటికే పవన్ పిలుపు ప్రకారం ఆయన అభిమానులు పలు ఛానళ్లను బ్యాన్ చేశారు. అంతేకాదు పవన్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్లు పెడుతూ మీడియాపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనపై అనవసరమై ఆరోపణలు చేశారని శ్రీనిరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులు అందుకున్న పవన్.. చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు నోటీసులు పంపించినా ఏం లాభం... ఆల్ ద బెస్ట్ అని చెప్పి లైట్ తీసుకున్నారు.

 

ఇక ఇప్పుడు తాజాగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా పవన్ చేసిన ఆరోపణలపై స్పందించారు. ఈయన కూడా పవన్ కు లీగల్ నోటీసులు పంపించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు.. త‌ననూ త‌న సంస్థ‌నూ ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌ను వెంట‌నే ట్విట్ట‌ర్ నుంచి తొల‌గించాల‌నీ,బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నీ, లేని ప‌క్షంలో తాను చ‌ట్ట‌ప‌రంగా ముందుకు వెళ్తాన‌ని కూడా హెచ్చ‌రించారు. త‌న వ్య‌క్తిగ‌త, రాజ‌కీయ లోపాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డం కోస‌మే విచ్చ‌ల‌విడిగా ప‌వ‌న్ ట్వీట్లు చేస్తున్నార‌నీ, ఆ వ్యాఖ్య‌ల్లో వాస్త‌వాలు లేవ‌నీ, అన్నీ ఊహాజ‌నితాలే అని అన్నారు. మీడియాపై చుల‌క‌న‌గా వ్యాఖ్యానాలు చేయ‌డం ఈ మ‌ధ్య కొంత‌మంది నాయ‌కుల‌కు అల‌వాటైపోయింద‌న్నారు. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ట్విట‌ర్ లో వ్యాఖ్య‌లు తొల‌గించ‌క‌పోతే తాను వేయబోయే సివిల్‌, క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం దావాను ఎదుర్కొన‌డానికి సిద్ధంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. మరి ఇప్పుడు ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి…? శ్రీనిరాజు నోటీసులను లైట్ తీసుకున్నట్టే రాధాకృష్ణ నోటీసులను లైట్ తీసుకొని దానికి కౌంటర్ ఏదైనా ఇస్తారా..?లేక సీరియస్ గా తీసుకుంటారా..? చూద్దాం ఏం జరుగుతుందో..