పవన్ కు జగన్ సపోర్ట్.. కానీ...!

 

ఉరుము ఉరిమి మంగలం మీద పడింది అన్న సామెత లాగ... అటు పోయి ఇటు పోయి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పవన్ కళ్యాణ్ కుటుంబంపై వ్యక్తిగత దూషణకు దిగేవిధంగా మారింది.దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. పవన్ కళ్యాణ్ ని, అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని.. పవన్ అభిమానులతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తపరిచారు. ఇక దీనిపై పవన్ కూడా స్పందించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఆరునెలలుగా తన గురించి టీవీ ఛానళ్లలో డిబెట్లు పెట్టి తిట్టిపోశారని.. ఇప్పుడు ఏకంగా తన తల్లినే తిట్టించే స్ధాయికి దిగజారారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పవన్... ఈ విషయం వెనుక ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసని.. తనపై జరుగుతున్న కుట్రను, అవమానాలకు కొందరు వ్యక్తులు కారణమని.. కొంత మంది పేర్లను కూడా బహిరంగంగానే ట్విట్టర్లో వారి ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకూ ట్విట్లర్లో పోస్ట్ లు చేస్తూ..  టీవీ9, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఇక ఈ విషయంలో పవన్ కు చాలా మంది సపోర్ట్ గా కూడా వస్తున్నారు. ఏదైనా ఉంటే విమర్శలు చేయవచ్చు కానీ.. వ్యక్తిగత దూషణలు చేయడం ఏంటీ.. అందులో తల్లిని తీసుకురావడం ఇంకా దిగుజారుడుతనానికి నిదర్శనం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

ఇక ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. నిజానికి పవన్ అంటే జగన్ కాస్త కోపం. ఎందుకంటే.. 2014లో పవన్ లేకపోతే తానే ముఖ్యమంత్రి అయ్యేవాడిని అని ఆయన భావన. అందుకే అప్పుడప్పుడు పవన్ పై విమర్సలు గుప్పించేవాళ్లు. అయితే ఎప్పుడైతే టీడీపీకి వ్యతిరేకంగా కామెంట్లు విసిరారో... అప్పటి నుండి కాస్త విమర్సలు తగ్గించారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ వివాదంపై కూడా జగన్ స్పందించి పవన్ కు మద్దతు పలికినట్టు తెలుస్తోంది. అయితే డైరెక్ట్ గా కాదు కానీ.. ఇన్ డైరెక్ట్ గా. పాదయాత్ర డైరీ అనే పేరుతో జగన్ రాస్తున్నట్టుగా సాక్షిలో ప్రచురితం అవుతున్న కాలమ్ లో దీనిపై జగన్ స్పందించారు. “ఢిల్లీకి రాజు అయినా అమ్మకు కొడుకే.. అన్నారు మన పెద్దలు. సృష్టిలో జీవులన్నిటికీ అమ్మే తొలి గురువు.. దైవం. అందుకే మాతృదేవోభవ అంటారు. అమ్మ స్థానం అంతటి ఉన్నతమైనది.. పవిత్రమైనది. కొద్ది రోజులుగా అమ్మ స్థానాన్ని దిగజార్చేలా.. అవమానపరిచేలా రాజకీయాలు సాగడం అత్యంత దారుణం.. మహాపాపం. అలాంటి దిగజారుడు రాజకీయాలు ఏమాత్రం సమర్థనీయం కాదు. గత 141 రోజులుగా చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ఎందరో అమ్మలు నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. వారి ఆప్యాయత, అనురాగాలు అనిర్వచనీయం. అందుకే మాది ఎప్పుడూ ఒకటే సిద్ధాంతం.. ‘అమ్మ ఎవరికైనా అమ్మే.. అమ్మకు నా వందనం” అని అన్నారు. మరి ఇప్పటికే రోజా పవన్ కు తన సపోర్ట్ ఉంటదని చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా పవన్ కు మద్దతు పలికారు. మొత్తానికి చంద్రబాబు కోపంతో.. ఇదే ఛాన్స్ అని భావించి పవన్ కు మద్దతు పలికినట్టున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..