TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కొత్త ఛానల్.. జేటీవీ..!

Published on: Fri Apr 20, 2018 5:32PM

 

పవన్ కళ్యాణ్ ఓ ఛానల్ ను పెట్టనున్నారా..? అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి ఇప్పుడు. తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తన ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లు పెట్టి ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అని వారి పేర్లు బయట పెట్టి.. ఏకిపారేశారు. అంతేకాదు మీడియా ఛానల్స్ కూడా ఓ రేంజ్ లో తిట్టిపారేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు ఫిలిం ఛాంబర్ కు వెళ్లి తన తల్లిని అంత దారుణంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని... వారికి ఒక రోజు డెడ్ లైన్ కూడా విధించినట్టు తెలుస్తోంది.

 

ఇక దీనిలో భాగంగానే మరో వార్త కూడా బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఓ టీవీ ఛానల్ రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ లో జే టీవీ అనే ఓ బ్యానర్ చక్కర్లు కొడుతోంది. 'జనం కోసం' ఇది ఛానల్ పేరు కాగా.. 'మీ కోసం.. మీ తోడుగా..' ఈ క్యాప్షన్ తో జే టీవీ అనే ఛానల్ రాబోతోందని ఈ పోస్టర్ సారాంశం. జనసేనకు అండగా నిలబడే ఉద్దేశ్యమే ఈ ఛానల్ అని... పవన్ కు సన్నిహితుడు.. గతంలో ఛానల్ నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తితో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన తర్వాత.. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే జే టీవీ రాబోతోందనే టాక్ అయితే గట్టిగానే ఉంది. మరి ఈ జేటీవీ లో వాస్తవం ఎంతో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

 

అయితే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ... అసలు పవన్ అభిమానులు ఎప్పటినుండో కోరుకునేది కూడా ఇదే. తమకు ఓ ఛానల్ లేకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందని.. ఛానల్ లేకపోవడం వల్ల తమమీద చాలా ఈజీగా బురద చల్లుతున్నారని... మనకంటూ ఓ ఛానల్ ఉండాలని పవన్ అభిమానలు ఎప్పటినుండో కోరుకుంటున్నారు. ఉన్న ఛానల్స్ లో ఏ ఒక్కటీ పవన్ అండగా ఉన్న దాఖలాలు లేవు. ఆ లోటు విషయం పవన్ కు కూడా ముందే తెలుసు కానీ.. ఓ మీడియా ఛానల్ ప్రారంభించాలనే పాయింట్ ను మాత్రం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆలోచన ఓ కొలిక్కి వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ టీవీ విషయంలో కూడా క్లారిటీ వచ్చేంత వరకూ ఆగాల్సిందే..