నాకు వద్దు మీ సెక్యూరిటీ...

 

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్క్యూరిటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది తనకు వద్దంటూ వెనక్కి పంపించేశారు. మార్చి 14వ తేదిన గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  తనపై దాడి చేసే అవకాశం ఉందని.... తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పవన్ ఏపీ డీజీపికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దాంతో పవన్ కు రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌కు 2+2 గన్‌మెన్లను కేటాయించింది. ప్రతి షిప్టులో ఇద్దరు గన్‌మెన్లు పవన్ కళ్యాణ్‌తోనే ఉంటారు. మిగిలిన ఇద్దరూ గన్‌మెన్లు రెస్ట్‌ తీసుకొంటారు. అయితే ఇప్పుడు ఈ సెక్యూరిటీ నాకు వద్ద అని పవన్ వారిని వెనక్కి పంపించేశారు.

 

దీనికి కారణం ఏంటంటే... తనకు నియమించిన సెక్యూరిటీని ప్రభుత్వం తనపై నిఘా కోసం ఉపయోగించుకొంటుందని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారు. పార్టీ అంతర్గత విషయాలు లీకయ్యాయని... జనసేన రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలతో పాటు ఇతర విషయాలపై పార్టీ చేసిన చర్చలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి చేరిపోయిందని భావిస్తున్నారు. నెల రోజుల కాలంలో పార్టీకి సంబందించిన కీలక చర్చలకు సంబంధించిన సమాచారం బయటకు వెల్లడైందని జనసేన చీఫ్ భావిస్తున్నారు. ఈ తరుణంలో సెక్యూరిటీ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే సెక్యూరిటీని వెనక్కు పంపించారన్న టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ సెక్యూరిటీ వెనక్కు వెళ్ళడంతో ప్రైవెట్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ రక్షణ బాధ్యతను చూసుకొనే అవకాశం ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం...