ఏపీలో 105 దాటేసిన పొలిటికల్ టెంపరేచర్..

 

ఈసారి సమ్మర్ సీజన్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతుంటే... ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ టెంపరేచర్ మాత్రం 105 దాటేస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది టైముంది. ముందస్తు ఎన్నికలు వస్తే తప్ప... వచ్చే సమ్మర్ సీజన్ వరకు ఎన్నికలు జరిగే ఛాన్సే లేదు. కానీ ప్రత్యేక హోదా పోరుతో ఏపీలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. స్పెషల్ స్టేషస్ ఇష్యూ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తోంది.

 

ఒకవైపు అధికార టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్, బైక్ ర్యాలీలు చేపడితే.... మరోవైపు ప్రతిపక్ష వైసీపీ... తన ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలో ఆమరణదీక్షలకు కూర్చోబెట్టింది. ఇక గుర్తొచ్చినప్పుడల్లా జనం మధ్యకొచ్చే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హోదా పోరులోకి దిగారు. వామపక్షాలతో కలిసి జాతీయ రహదారులపై పాదయాత్రలకు పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ స్వయంగా బెజవాడ బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.

 

మొత్తానికి ఈ సమ్మర్ సీజన్ కూల్ కూల్ గా ఉంటుందంటూ భారత వాతావరణశాఖ చల్లని వార్త చెబితే... ఏపీలో మాత్రం పొలిటికల్ టెంపరేచర్ సెగలు పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో  రేగుతోన్న రాజకీయ సెగ.... దేశ రాజధాని ఢిల్లీని సైతం వణికిస్తోంది. దాంతో ఏం చేయాలో తోచక మోడీ సర్కార్ తప్పించుకొని తిరుగుతోంది.