లోకేశ్ పై పవన్ కామెంట్లు.. ఓ మంత్రిగారి హస్తం...

 

గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి ఇచ్చిన షాక్ ఎవ్వరూ మరిచిపోలేనిది. ఎందుకంటే అప్పటి వరకూ ఇద్దరిదీ ఒకే జట్టు అని అందరూ భ్రమలో ఉండగా.. కాదు అని టీడీపీ పై ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోశారు పవన్. నిజానికి టీడీపీ పై చేసిన ఆరోపణలు వైసీపీపై బీజేపీ పై కూడా చేసి ఉండరు ఆయన. అంతలా టీడీపీపై విమర్శలు చేశారు. అంతేనా బహిరంగంగానే చంద్రబాబు తనయుడు లోకేశ్ పై అవినీతి ఆరోపణలు గుప్పించారు. మంత్రి లోకేష్‌ అవినీతిపరుడని...ఆయన అవినీతికి పాల్పడుతున్నారని... మీ కుమారుడి అవినీతి గురించి మీకు తెలీదా అంటూ ఏకంగా చంద్రబాబునే ప్రశ్నించాడు ఆయన. దీంతో ఇంత సడెన్ గా పవన్ యూటర్న్ తీసుకోవడం చూసి షాకైన టీడీపీ నేతలు.. ఆ మరుసటి రోజు నుండి పవన్ పై ముప్పేట దాడి చేశారు. పవన్ వెనుక బీజేపీ ఉందని..పవన్, వైసీపీ కలిపోయాయని ఇలా ఎవరికి నచ్చిన వాదన వారు వినిపించారు.

 

అయితే విమర్శలు అయితే గుప్పించారు కానీ.. అసలు పవన్ ఇలా మాట్లాడటానికి కారణం ఏంటీ.. దీని వెనుక ఎవరు ఉన్నారు...'లోకేష్‌' అవినీతికి పాల్పడుతున్నారని...'పవన్‌'కు చెప్పిందెవరు..? అసలు 'లోకేష్‌'పై 'పవన్‌'ను ఉసిగొల్పింది..ఎవరు? అన్న విషయాలపై టీడీపీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం బయట పడింది.  లోకేష్‌పై 'పవన్‌' అవినీతి ఆరోపణలు చేయడం వెనుక...చంద్రబాబు మంత్రివర్గంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మంత్రి హస్తం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మంత్రే...'పవన్‌'కు క్లూ ఇచ్చారని... 'లోకేష్‌' ఎక్కడ అక్రమాలు చేశారో...ఆయన చెప్పారని...అయితే...'లోకేష్‌' చేసిన అవినీతికి మాత్రం ఆధారాలు చూపకుండా...యధాలాపంగా...'లోకేష్‌' అవినీతిపరుడని...'పవన్‌'తో వ్యక్తిగత సంభాషణల సమయంలో చెప్పారట. దీంతో...'పవన్‌' దాన్నే ఆధారంగా చేసుకుని 'లోకేష్‌'పై ఆరోపణలు చేశారట. దీంతో ఇప్పుడు ఆ మంత్రిగారు ఎవరబ్బా అనే చర్చలు మొదలయ్యాయి. .'చంద్రబాబు' క్యాబినెట్‌ సహచరుడే...ఆయన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని..ప్రచారం చేయడంపై టిడిపి వర్గాలు అవాక్కు అవుతున్నారట. ఆ మంత్రి ఎవరు..? ఆయన 'లోకేష్‌'పై ఎందుకు కత్తి కట్టారు...? వ్యాపార లావాదేవీల్లో వారిద్దరి మధ్య ఏమైనా తేడాలు వచ్చాయా...? లేక...ఇంకేమైనా రాజకీయ ప్రయోజనాలను ఆశించి..ఆ మంత్రి...'లోకేష్‌' అవినీతిపై ప్రచారం చేస్తున్నారా...? అనేదానిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సదరు మంత్రి 'పవన్‌'తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారా...? వచ్చే రోజుల్లో ఆయన 'జనసేన' పార్టీలో చేరతారా..? దీని కోసమే...ఆయన 'లోకేష్‌' అవినీతి గురించి ప్రచారం ప్రారంభించారా...? అనే ప్రశ్నలు టిడిపి వర్గాల నుంచి వస్తున్నాయి. మరి పవన్ వెనుక ఉన్న ఆ మంత్రిగారు ఎవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.