మరీ ఇంత జోకర్ అయ్యావేంటి సామి...

 

ఇప్పటికే పవన్ కళ్యాణ్ తనకు తెలిసీ తెలియని మాటలతో ఆయనకు రాజకీయ విజ్ఞత లేదు... ఏం మాట్లాడటాతో ఆయనకే తెలియదు అంటూ...కొంతమంది అయితే అసలు పవన్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మిడి మిడి జ్ఞానంతో.. అడ్డదిడ్డమైన సమాధానాలతో ఉన్న పరువు కాస్త పొగొట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏకంగా పెద్ద జోకర్ అయిపోయాడు. వామపక్షాలతో కలిసి ప్రత్యేకహోదా ఉద్యమం కాన్సెప్ట్ మీద సమావేశం పెట్టిన ఆయన మాంచి కామెడీ చేశారు.

 

ఆ కామెడీ ఏంటంటే....సాధారణంగా పవన్ మాట్లాడేప్పుడు నేల చూపులు చూస్తుంటారు కదా... అలాగే నేల చూపులు చూస్తూ... ఎవరైనా ఏదైనా అంటారేమో అన్న చందాన... కేంద్రం, మోడీ, అమిత్ షా గురించి పొడి పొడిగా మాట్లాడుతూ.. ఆ తర్వాత సంబంధం లేని విషయాలను ఎత్తుకుని… ఆవేశం చూపించారు. రాజధానిలో ఇతర ప్రాంతాలకూ భూమి కేటాయించాలట. ఢిల్లీని చూస్తే…. రాజధానిలో ఇతర ప్రాంతాలకూ భూమి కేటాయించడం. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు అమరావతిలో రెండు వేల ఎకరాలు కేటాయించాల్సిన అవసరం ఉందనేది పవన్ మాట. ఇక్కడే పవన్ దొరికిపోయాడు. రాజధానిలో 2వేల ఎకరాలు ఏంది సామి అని సోషల్ మీడియాలో ఆయనపై అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఏకంగా కేఏపాల్ తో పోల్చుతూ కామెడీ చేసుకుంటున్నారు. కేఏపాల్ ఎంత సీరియస్ గా హిలేరియస్ కామోడీ చేస్తారో..పవన్ కూడా అలాగే కామెడీ చేస్తున్నారని అన్నారు. మ‌రి రెండు వేల ఎక‌రాల‌ను ఎలా పంచాలో ఫార్ములా కూడా చెప్పి ఉంటే బాగుండేది. ఏయే జిల్లాకు ఎంత‌? ఏయే కులానికి ఎంత‌? అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ల వాటా ఎంత‌?. ఈ ప‌వ‌న్ ఎపుడూ ఇంతే.. ఏదీ ప‌క్కా ప్లాన్ తో రాడు… ఈసారైనా బ్లూ ప్రింట్ తో రా సామీ… అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. దీంతో పపన్ కల్యాణ్ నోరు విప్పకపోతేనే బావుంటుందని అనుకుంటున్నారు. మరి నిజంగానే పవన్ మాట్లాడకుండా ఉంటేనే బావుంటుందన్న వాదన వినిపిస్తుంది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా.. ఎక్కడో రాజధానిలో తెలుగు వాళ్ల కోసం భూమి కేటాయించాలి పవన్ అనడం నిజంగా ఆయన ఫూలిష్  నెస్సే అవుతుంది. ఇప్పటికైనా ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే బెటర్..