ఇంతలా లొంగిపోవాలా పవన్..?..ఏం సాధించడానికి

 

నాకు కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది.. ఇది పవన్ కళ్యాణ్ డైలాగ్. కానీ ఇప్పుడు చూడబోతే ఆయనకు తిక్కుంది కానీ.. దానికి లెక్కలేకుండా ఉందన్నట్టుంది పరిస్థితి. ఒకపక్క ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో ఎంపీలందరూ పోరాటం చేస్తుంటే.. మరోపక్క పవన్ మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీపై విమర్శలు గుప్పించి ట్విస్ట్ ఇచ్చిన పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి అయోమయంలో పడేశాడు. ఓ నేషనల్ మీడియా ఛానల్ తో మాట్లాడిన పవన్... ప్రభుత్వంలోని అవినీతిపై చంద్రబాబుకు తెలుసు.. 40 మంద ఎమ్మేల్యేలు, కొంత మంది టీడీపీ నేతలు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై నాకు చెప్పారు.. నేను కూడా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబుకు చాలా సార్లు చెప్పా.. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి.. లోకేశ్ కు ఉన్న లింకులపై న్యాయ విచారణ చేపట్టాలి అని అన్నారు. అంతేకాదు.. మోడీతో నాకు సాన్నిహిత్యం ఉన్న మాట వాస్తవమే అని చెప్పారు.

 

ఇక ఇన్ని రోజులు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా.. ప్రజలతో కలిసి పోరాడతా.. ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటూ.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ డైలాగులు చెప్పిన ఆయన ఇప్పుడు ఆవిషయంలో కూడా మాట మార్చాడు.  ప్రత్యేక హోదా అనేది రాజకీయ పార్టీల నుండి వస్తున్న డిమాండ్.. దీనిపై ప్రజల్లో పట్టింపు లేదు.. హోదానా, ప్యాకేజీనా అనేది అనవసరం, మాకు డబ్బులు" కావలి అంటూ మాట్లాడారు. మరి హోదా అవసరం లేదని ఇప్పుడు చెబుతున్నారు.. గతంలో చంద్రబాబు కూడా ఇదే కదా చెప్పింది. హోదా.. అయినా ప్యాకేజీ అయినా ఏపీకి న్యాయం చేస్తే చాలు అని.. మరి ఇదే విషయం చంద్రబాబు అంటే, పాచి పోయిన లడ్డులు అని చెప్పిన పవన్.. ఇప్పుడు ఇలాంటి పలుకులు పలుకుతున్నారు. ఇప్పుడు పవన్ ను ఏమంటారు..?

 

ఇక పొతే, కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి కూడా చెప్పారు...కెసిఆర్ కు, థర్డ్ ఫ్రంట్ పెట్టమని చెప్పింది తానే అని చెప్పారు... 10 మార్కులకు గాను, చంద్రబాబుకి 2.5 మార్కులు, కెసిఆర్ కు 6 మార్కులు వేస్తున్నట్టు చెప్పారు పవన్...దీన్ని బట్టి పవన్ వెనుక బీజేపీ ఉందన్న వార్తలు నిజమేనేమో అని అనుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలు చంద్రబాబును ఎదుర్కోవడానికి ఇక్కడ పవన్ ను, తెలంగాణలో కేసీఆర్ ను ఎందుకంటే..పర్ఫెక్ట్ గా వాడుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒక పక్క ఢిల్లీతో చంద్రబాబు పోరాడుతుంటే.. చాలా పార్టీలు మద్దతిచ్చాయి కానీ టీఆర్ఎస్ మాత్రం ఇంతవరకూ మద్దతివ్వలేదు. ఇక ఈ టైంలో పనిగట్టుకొని పవన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం.. దానికితోడు.. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేయడం.. దీంతో పవన్ బీజేపీతో కలుస్తాడు అనే ప్రచారం నిజం అని పవన్ మాటలను బట్టి తేలిపోతుంది. మొత్తానికి నిన్న మొన్నటి వరకూ పవన్ పై ఉన్న అభిప్రాయం.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కనీసం ఎన్నికల సమయానికైనా ఈయన ఓ క్లారిటీతో ఉంటారో లేదో..?