ఐటీ అధికారులను పంపిచారు.. వాడుకొని వదిలేశారు...

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తందా పెద్ద ఎత్తున ఆందోళలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక పార్లమెంట్ లో కూడా ప్రత్యేక హోదాపై ఏపీ నేతలందరూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలతో నిరసన గళం విప్పారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ పార్టీ నేతలు కూడా మద్దతు పలికారు. ఇక ఇన్ని ఆందోళనలు చేస్తున్నా.. కేంద్రం మాత్రం ఏపీకి మరోసారి మొండిచెయ్యే చూపించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పేసింది.

 

ఇదిలా ఉండే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాపై బాధ్యతతో వ్యవహరించాల్సిన పార్టీలు చిల్లరగా ప్రవర్తిస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పారు.  హోదా కోసం జేఏసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని.. జిల్లాస్థాయి నేతలు అందరూ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని సూచించారు. అంతేకాదు... చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కేసులకు భయపడుతున్నారని.. తనపైకి ఐటీ అధికారులను పంపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో నన్ను వాడుకుని వదిలేశారనే భావిస్తున్నా... 2019 ఎన్నికల్లో నాస్టాండ్‌ ఎంటో చెబుతానని పవన్‌ అన్నారు.

 

ఇంకా థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ... థర్డ్ ఫ్రంట్ అధికారం కోసమే అని అందరూ అనుకుంటున్నారని.. థర్డ్ ఫ్రంట్ అని తాము చెబుతోంది అధికారం కోసం కాదని, రాజకీయాల్లో మార్పు కోసమని చెప్పారు.థర్డ్ ఫ్రంట్‌లో దక్షిణాది నుంచి అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని, కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకించే పార్టీలు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు.