పవన్ డెడ్ లైన్ ఓవర్... నెక్స్ట్ టార్గెట్ ఏంటి?

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి ఇచ్చిన డెడ్ లైన్ డేట్ ముగిసింది. పవన్ టీడీపీకి పెట్టిన డెట్ లైన్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. 15 వ తారీకు లోపు విభజన హామీలు, ఇంకా ప్రత్యేక హోదాపై పూర్తి వివరాలు ఇవ్వాలని టీడీపీకి డెడ్ లైన్ పెట్టారు. పోలవరం ప్రాజెక్టు శ్వేతపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఇవ్వలేదు... కనీసం ఇప్పుడు అయినా రాష్ట్ర ప్రజల మంచి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల వివరాలను అందివ్వాలిని పవన్ టీడీపీకి  డెడ్ లైన్ పెట్టారు. అయితే ఈ రోజు 15వ తేది. పవన్ ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయింది. కానీ టీడీపీ మాత్రం ఎలాంటి వివరాలు అందించలేదు. దీంతో పవన్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఉద్దానం విషయంలో కూడా పవన్ ఇలానే ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చాడు. అయితే అప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి.. ఉద్దానం సమస్యపై పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. అసలు ఈ విషయంలో టీడీపీకే క్లారిటీ లేదు.. వాళ్లే కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. పాపం ఇంక పవన్ కు ఏం చెబుతారు.

 

ఇక ఇప్పటికే లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ లతో చర్చలు జరిపిన పవన్, ఇంకా వామపక్ష నేతలను, జేఎఫ్సీ ప్రతినిధులను కలసి వారితో చర్చించనున్నారు. రఘువీరా రెడ్డి వంటి కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలతోనూ ఆయన మాట్లాడే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరి ఈరోజుతో పవన్ ఇచ్చిన డెడ్ లైన్ పూర్తవుతుంది. ఇక తాను పెట్టిన డెడ్ లైన్ ముగిసేలోగా, ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను పవన్ కల్యాణ్, రేపే ప్రకటిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.... పవన్ ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం..