TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

"కాపు" కోసం చంద్రబాబు కాపు..?

Published on: Fri Jan 22, 2016 2:36PM

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లినట్టు వార్తాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లిన నేపథ్యంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతున్న వేళ ఇంత సడెన్ గా ఆయన సింగపూర్ వెళ్లడంతో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారా..? అని లేక రాజకీయంగా వెళ్లారా అని అనుకుంటున్న వేళ పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సింగపూర్ లో కలుసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే సింగపూర్లో కలుసుకున్న వీరిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నారా అని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఎక్కడా కాకుండా.. సింగపూర్ వెళ్లి మరీ అంత చర్చించుకోవాల్సిన విషయం ఏంటని అందరూ అనుకుంటున్నారు. అయితే ఎన్నికల నేపథ్యానికి గురించి వీరు మాట్లాడుకున్నారని.. ముద్రగడ పద్మనాభం నిర్వహిస్తున్న కాపు గర్జనకు కాపులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిన చంద్రబాబు… ఈ అంశానికి సంబంధించే పవన్ తో చర్చలు జరిపి ఉంటారని పలువురు భావిస్తున్నారు. పవన్ సహకారంతో కాపులు అటు వైపు మళ్లకుండా టీడీపీ అధినేత ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.

మరోవైపు నిజంగానే పవన్ సింగపూర్లో చంద్రబాబుతో భేటీ ఆయ్యారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే పవన్ సింగపూర్ వెళ్లడం మాత్రం నిజం. మరి దీని గురించి తెలియాలంటే చంద్రబాబు కాని.. పవన్ కాని ఇద్దర్లో ఎవరో ఒకళ్లు నోరు విప్పాల్సిందే..