పవన్ పోటీ చేసేది అక్కడి నుండే...

 

వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాను ఏ నియోజక వర్గం నుండి పోటీ చేస్తా అన్న విషయం మాత్రం ఇప్పటివరకూ ప్రకటించలేదు. అయితే ఇప్పుడు తాను  ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నది బయటికి లీక్ అయింది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ ఆలోచన చేస్తున్నాడని ఆ జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌ ముత్తంశెట్టి కృష్ణారావు తెలియజేసారు. అవనిగడ్డలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ విషయం చెప్పారు. అయితే దీనిపై ఇంత పవన్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..