TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధం..

Published on: Tue May 1, 2018 4:49PM


త్వరలో ప్రజల మధ్యకు వస్తానని.. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. అంతేకాదు జనసేన పార్టీ వ్యూహకర్తగా దేవ్ ను నియామిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని.. బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ప్రణాళిక బద్దంగా అడుగులు వేద్దామని...పార్టీకి అనుభవం లేకపోయినా ప్రతి కార్యకర్తకు రెండు ఎన్నికల్లో పని చేసిన అనుభవం ఉందని అన్నారు. తెలంగాణలో పోటీ ప్రణాళిక ఆగష్ట్ లో వెల్లడిచేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి జనసేన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.