బొక్కలు, లొసుగులు ఉన్న మీరు భయపడతారు...

 

ఎప్పుడైతే పవన్ టీడీపీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారో అప్పటి నుండి ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో మొన్నటి వరకూ పవన్ వెనుక టీడీపీ ఉంది.. టీడీపీ కీలుబొమ్మ పవన్ అని అన్నవాళ్లు.. పవన్ యూటర్న్ తీసుకోవడంతో ఇప్పుడు పవన్ వెనుక బీజేపీ ఉందని అంటున్నారు. ఇక తనపై వస్తున్న వార్తలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పవన్ ఓ ట్వీట్ ఉంచారు. మొన్నటి దాకా తనను టీడీపీ మనిషినని అన్నారు... ఇప్పుడేమో బీజేపీ మనిషినని అంటున్నారు, బొక్కలు, లొసుగులు ఉన్న టీడీపీ వారు కేంద్రానికి భయపడతారేమో తప్ప, తాను ఎవరికీ భయపడబోనని, తలొగ్గనని స్పష్టం చేశారు. ఇక పవన్ పెట్టిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.