TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేశ్ అవినీతి గురించి మీకు తెలుసా చంద్రబాబు..

Published on: Wed Mar 14, 2018 7:25PM

 

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ టీడీపీపై బహిరంగంగానే విమర్శల బాణాలు గుప్పించారు. విభజన తరువాత అవినీతిలో ఏపీ నెం.1 అని ఓ సంస్ధ వెల్లడించింది.. ఇదా మీరు సాధించిన ప్రగాతి అని చంద్రబాబును అడిగా.. చంద్రబాబుకు మద్దతిచ్చింది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికే కానీ... టీడీపీ పునర్నిర్మాణ కోసం కాదని అన్నారు. రాజధాని నిర్మణానికి 1500 ఎకరాలు అవసరమని చంద్రబాబు అన్నారు.. నేను నమ్మాను.. కానీ ఇప్పుడది లక్ష ఎకరాలకు వరకూ వెళ్లింది...టీడీపీ మూడు మాటలు మాట్లాడితే... ఆరు అబద్దాలు వినిపిస్తున్నాయి.. అని మండిపడ్డారు. ఎన్నికల ఖర్చుకోసం అవినీతికి పాల్పడుతున్నామని చెబుతున్నారు... 2019 ఎన్నికలకు ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు సర్దేశాం అని టీడీపీ నేతలు సిగ్గులేకుండా చెబుతున్నారు..అసుల లోకేశ్ అవినీతి గురించి మీకు తెలుసా... తెలియదా అని చంద్రబాబునే డైరెక్ట్ గా ప్రశ్నించారు.