అరుణ్ జైట్లీపై పవన్ ఆగ్రహం..
Published on: Wed Mar 14, 2018 6:57PM
.jpg)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంపై నిప్పులు చేరిగారు. ముఖ్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని టార్గెట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ గారూ... తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినందకు కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం వచ్చింది.. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు.. మీ చట్టాలను మేమెందుకు పాటించాలని ప్రశ్నించారు. విభజన సందర్బంగా ఏపీకి ప్రత్యేక హోదా 15 ఏళ్లు ఇస్తామన్నారు.. కానీ ఇప్పుడు ఎందుకు మాట మార్చారుసెంటి మెంట్ తో హోదా ఇవ్వలేమని చెప్పారు.. సెంటిమెంట్ తో తెలంగాణ ఇవ్వలేదా..? అని అన్నారు. గత నాలుగేళ్లుగా ఏపీకి చేస్తున్న అన్యాయం మమ్మల్ని రగిలిస్తోంది.. హోదాపై మాట తప్పి... మీ మాటలతో ఆంధ్రప్రదేశ్ ను ఉద్యమంలోకి నెట్టారని అన్నారు. 25 మంది ఎంపీలతో 5కోట్ల మందిని కంట్రోల్ చేయలనుకోవడం సాధ్యం కాదు.. కేంద్రం అంటే నాకు భయం లేదు.. సీబీఐ అంటే కొందరు భయపడతారేమో.. నాకు ఎలాంటి భయం లేదు అని అన్నాడు..


