అలా అయితే ప్రజలను పాలించే హక్కు లేనట్టే...
Published on: Sat Mar 3, 2018 5:00PM
.jpg)
11 అంశాలను జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ గుర్తించింది.. ప్రజలకు ఏవైతే ఉపయోగపడతాయో వాటినే చేర్చామని పవన్ అన్నారు. పోలవరం బాధ్యత కేంద్రమే తీసుకోవాలి.. సరైన సమయానికి పూర్తిచేసే బాధ్యత కేందానిదే.. పోలవరం ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోతే అది కేంద్రం.. తప్పు కాదు.. రాష్ట్ర ప్రభుత్వానిదే అని సూచించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని అంటున్నారు... అప్పుడు తెలియదా... విశాఖ రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటించాలి.. పార్లమెంట్ లో ఇచ్చిన హామీని నెరవేర్చుకపోతే.. ప్రజలను నైతికంగా పాలించే అర్హత కోల్పోయినట్టే అని అన్నారు. అంతేకాదు...దుగరాజపట్నం పోర్ట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీరు ఇలానే ఉంది... ఈ పోర్ట్ కాకపోతే వేరే పోర్టు ఎందుకు సూచించడంలేదు.. పోర్ట్ వల్ల ఏపీకి ఎక్కువ ఆదాయం వస్తుందని అన్నారు. ఇంకా ఏపీలో 11 జాతీయ స్థాయి విద్యా సంస్థల కోసం ఇప్పటికీ నామ మాత్రంగానే నిధులు ఇచ్చారని పవన్ కల్యాణ్ తెలిపారు. 5 శాతం మాత్రమే నిధులు ఇచ్చారని, ఇన్నేళ్లలో కేవలం 5 శాతం మాత్రమే ఇవ్వడమేంటని అన్నారు. ఏది అడిగినా అది సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం అంటోందని, మరి ఏది సాధ్యం అవుతుందో చెప్పాలని ఆయన అన్నారు.


