బాబుకు పవన్ ప్రశ్న.. కావాలని చేస్తున్నారా..?
Published on: Sat Mar 3, 2018 4:30PM
.jpg)
ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాలని జేఎఫ్సీ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా తెలిపారు. రాష్ట్ర విభజనతో ఇబ్బంది పడుతుంది ప్రజలే.... ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడేలా ఎవరూ కృషిచేయలేదు.. ప్రజలను కదిలించారు కానీ..స్థిరాస్తి ఇక్కడే మిగిలిపోయింది...స్థిరాస్తుల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు... హైదరాబాద్ లోనే అన్నిసంస్థలు ఉండిపోయాయని అన్నారు. హోదానో, ప్యాకేజో చంద్రబాబే తేల్చుకోలేకపోయారు.. ప్రజలను అయోమయంలో పడేశారు.. మీరే కన్ఫ్యూజ్ అయితే ఎలా... రాజకీయ అనుభవం ఉన్నవారు కాబట్టే మీకు మద్దతిచ్చాను.. మీరు కావాలని చేస్తున్నారా..?అవగాహన లేక చేస్తున్నారా..? అని డైరెక్ట్ గా ప్రశ్నించారు.


