TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జేఎఫ్సీ రిపోర్ట్.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.

Published on: Sat Mar 3, 2018 4:15PM

 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జేఎఫ్సీ రిపోర్ట్ వివరాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తున్న ఫ్యాక్స్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... విభజనలో రాజకీయ నేతల పాత్ర ఉంది కానీ.. ప్రజల పాత్ర లేదు.. విభజన వల్ల పుట్టిన పార్టీనే జనసేన అని... స్పెషల్ స్టేటస్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. పేరు ఏది పెట్టినా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అన్నారు. పదో షెడ్యూల్ లో ఉన్న ఆస్తులను సమానంగా పంచాలని డిమాండ్ చేశారు.