కాసేపట్లో బయటకు రానున్న జేఎఫ్‌సీ నివేదిక..
Published on: Sat Mar 3, 2018 2:12PM

ఏపీకి నిధులు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం అంటుంటే.. ఇవ్వలేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుంటున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ రెండు ప్రభుత్వాల్లో ఏది నిజం చెబుతుంది అని నిగ్గు తేల్చడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్... జేఎఫ్‌సీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన నివేదిక ఇప్పటికే పవన్ కు అందినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో..నివేదికలో ఉన్న పూర్తి వివరాలను కాసేపట్లో అధికారికంగా బయటపెట్టనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తుది నివేదిక రూపకల్పన సమావేశం జరుగుతోంది. లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, పవన్ కల్యాణ్, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శకులు ఈ నివేదికను పరిశీలిస్తున్న తెలుస్తోంది.


