అప్పుడు పోటీ చేయనందుకు బాధపడుతున్నా....

 

గత ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే.. జనసేన గొంతు బలంగా వినిపించే వాడిని.. 2014 ఎన్నికల్లో పోటీ చేయనుందుకు ఇప్పుడు బాధపడుతున్నా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.  ఆశయసాధన కోసం అందరూ కలిసి పనిచేయొచ్చని తెలంగాణ పోరాటం నిరూపించింది.. అలాగే ప్రత్యేక హోదా కోసం కూడా పార్టీలన్నీ కలిసి పనిచేయోచ్చు...అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.. కానీ ఏపీలో అవకాశవాద రాజకీయాలు కనిపిస్తున్నాయి అని అన్నారు. జనసేన గొంతు ఒక్కటే సరిపోవడం లేదు.. ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణ లాంటి ఇతర మేధావులందరితో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేయలని భావిస్తున్నా... జేఏసీ ఏర్పాటుపై ఉండవల్లి, జేపీని కలిసి చర్చిస్తా అని.. జేఏసీకి చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇంకా బడ్జెట్ విషయం ఏపీకి జరిగిన అన్యాయానికి గాను రేపు బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా... దీనిపై కూడా పవన్ స్పందిస్తూ... నేను బంద్ లకు వ్యతిరేకం కాదు... శాంతియుతంగా దర్నాలు చేయడానికి జనసేన మద్దతిస్తుందని అన్నారు.