2019 ఎన్నికల్లో యువత మార్పు చూపిస్తుంది....

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం పర్యటన ప్రారంభమైంది. అనంతపురం చేరుకున్న ఆయన ముందు జనసేన కార్యలయానికి భూమిపూజ చేశారు. అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....నేను జీవిత ప్రయాణికుడిని.. 2019 ఎన్నికల్లో ఎన్ని మార్పులు వస్తాయో యువత చూపిస్తుంది... సమస్యలపై పోరాడేందుకు నేను ఉన్నా... విద్యార్ధులు బాగా చదువుకోవాలి అని సూచించారు. నా ఆఖరి శ్వాస వరకూ రాయలసీమకు అండగా ఉంటా...రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుదాం.. మీరు నాకు ఓటు వేసినా.. వేయకపోయినా నేను మీకోసం పని చేస్తా...ప్రజల మేలు కొరకు నిరంతరం కృషి చేస్తా అని అన్నారు. అంతేకాదు.. ప్రజా సమస్యలపై చిత్తశుద్దితో ముందుకెళుతున్నాం...మన రాష్ట్రాలకు ఒక పార్టీ, ఒక నాయకత్వం సరిపోదు... అవసరమైతే ప్రధాని దగ్గరకు వెళ్లి సమస్యలు వివరిద్దాం అని వ్యాఖ్యానించారు.