పవన్ కల్యాణ్ పాపం పసివాడు...

 

‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’ ఈ మాటలు అన్నది ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. 2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పార్టీని ముందుండి నడిపిస్తానని, ఎవరు అడ్డొస్తారో చూస్తానని, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తాము గెలుస్తామంటూ దీమా వ్యక్తం చేశారు. సీఎం రేసులో తాను లేనని, ఆ ఆశ కూడా తనకు లేదని, కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం అభ్యర్థేనని అన్నారు. అంతేకాదు... టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ మాటల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. ఇంకా పవన్ కల్యాణ్ ఖమ్మం పర్యటన పై కూడా ఆమె స్పందించారు. ‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’ అని కామెంట్ విసిరారు.